అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగాయి. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)పెద్దకుమారుడు, స్టార్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) ఓ ఇంటి వాడయ్యాడు. ప్రముఖ నటి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) మెడలో చైతూ మూడు ముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయ ప్రకారం బుధవారం రాత్రి 8.13 నిమిషాలకు చైతూ-శోభిత ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios)లో వీరి వివాహతంతు అంగరంగ వైభవంగా జరిగింది. నాగ చైతన్య-శోభిత వివాహానికి అక్కినేని కుటుంబసభ్యులతో దాదాపుగా 500మందికి పైగా అతిథులు హాజరయ్యారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన తారాగణం
ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోను విద్యుత్ దీపాలు, పూలతో వేదిక అందంగా అలంకరించారు. వీరి పెళ్లి ఫొటోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి వేదిక వద్ద భారీగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), రామ్ చరణ్(Ramcharan), ఉపాసన వచ్చారు. మహేష్ బాబు(Mahesh Babu), నమ్రత శిరోద్కర్, అల్లు అర్జున్(Allu Arjun) వంటి తారలు ఈ వేడుకకు హాజరయినట్టు సమాచారం. వీరితో పాటు వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్, NTR, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి(Rana),సుహాసిని, కీరవాణి, అడవి శేష్, సుశాంత్ తదితరులు
హాజరయ్యారు.
అలా కలిశారు.. ఇలా ఒక్కటయ్యారు..
కాగా శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యుల విషయనికొస్తే శాంతకామాక్షి,వేణుగోపాలరావు (Shantakamakshi, Venugopala Rao)ల పెద్ద కూతురు. శోభిత తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజినీర్‌గా పని చేశారు. తల్లి ప్రైమరీ స్కూల్ టీచర్ గా పనిచేసేది. శోభితకి సమంత(Samantha) అనే సోదరి కూడా ఉంది. శోభిత సినిమాల్లోకి రాకముందు కొంతకాలంపాటూ మోడలింగ్ చేసింది. గతంలో ఓ బాలీవుడ్ సినిమాలో నటించే సమయంలో చైతూ-శోభిత ప్రేమ చిగురించింది. దీంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇక నాగ చైతన్యకి ఇది రెండో వివాహం. 2017 అక్టోబర్‌లో సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu)ని వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించి, 2022లో విడాకులు తీసుకున్నారు.
#NagaChaithanya tied a knot to #shobhitadhulipala pic.twitter.com/5NEg0IfeOx
— Cinema Manishi News (@cinema_manishi) December 4, 2024






