అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్(Thandel)’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి(Director Chandu Mondeti) తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్(Geeta Arts Banner)పై బన్నీ వాసు నిర్మించారు. మొదటి రెండు పాటలు బుజ్జి తల్లి, నమో నమః శివాయకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్(DSP) స్వరపరిచిన థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సా(Highlesso Highlessa)ను విడుదల చేశారు. వండర్ ఫుల్ మోలోడీస్‌ని కంపోజ్ చేయడంలో మాస్టర్ అయిన రాక్‌స్టార్ DSP, హృదయాన్ని తాకే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశాడు. శ్రేయా ఘోషల్(Shreya Ghoshal), నకాష్ అజీజ్ వోకల్స్ మెలోడీని మరింత ఎలివేట్ చేశాయి. శ్రీమణి లిరిక్స్ విడదీయరాని ప్రేమని చాలా గొప్పగా ప్రెజంట్ చేశాయి. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
స్టేజీపై డ్యాన్స్ చేసి సందడి చేసిన అల్లు అరవింద్
ఇక అంతకుముందు ‘తండేల్’ థర్డ్ సింగిల్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్(Allu Arvind) సందడి చేశారు. ‘హైలెస్సో హైలెస్సా’ సాంగ్‌కు ఆయన వేదికపై విద్యార్థులతో కలిసి స్టెప్పులేశారు. అక్కడే ఉన్న హీరో నాగచైతన్య( Naga Chaitanya), దర్శకుడు చందూ మొండేటి చప్పట్లు కొడుతూ అరవింద్‌ను ఎంకరేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(SM)లో వైరలవుతోంది. కాగా దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘తండేల్’ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్(Posters)లు, గ్లింప్స్ అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సారి నాగ చైతన్యకు పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు పడటం పక్కా అని అక్కినేని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
#AlluArvind dance 💚 pic.twitter.com/hwkMpDasQF
— Movies4u Official (@Movies4u_Officl) January 23, 2025







