ఎన్టీఆర్ (NTR)తో త్రివిక్రమ్ ఓ మూవీ తీయనున్న విషయం తెలిసిందే. పౌరాణిక చిత్రంగా దీన్ని రూపొందించనున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ప్రొడ్యూసర్ నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్‌ను సీనియర్ ఎన్టీఆర్‌లా (NTR–Trivikram movie) చూపించనున్నామని, బాలీవుడ్లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘రామాయణ’ కంటే భారీ స్థాయిలో తీసుకురానున్నట్లు తెలిపారు. హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి ‘వార్2’లో ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ప్రచారంలో భాగంగా నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాగా ఆ మూవీలో ఎన్టీఆర్ రోల్‌తో, త్రివిక్రమ్‌తో సినిమా గురించి వెల్లడించారు.

ఆ ఒక్క సీన్ చూసే తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నా..
“వార్ 2లో (WAR 2) ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీస్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. అది తారక్- హృతిక్ ఫైటింగ్ సీన్. ఆ ఒక్క సీన్ చూసే నేను ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరు స్టార్ హీరోలు హోరాహోరీగా తలపడితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ ఇద్దరూ సినిమా అంతా కనిపిస్తారు. ఎన్టీఆర్ కేవలం కొన్ని సీన్స్‌లో మాత్రమే కనిపిస్తారనేది కేవలం రూమర్స్ మాత్రమే. మూవీలో ఇద్దరికీ సమానమైన ప్రయారిటీ ఉంది’ అని పేర్కొన్నారు.

త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమా పూర్తికాగానే..
ఇక త్రివిక్రమ్‌తో సినిమా గురించి మాట్లాడుతూ.. “త్రివిక్రమ్- ఎన్టీఆర్ సినిమా ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాం. త్రివిక్రమ్ మొదటిసారి మైథలాజికల్ సినిమా తీస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూశాం. ఇప్పుడు తారక్‌ను అలా చూపించనున్నాం. ‘రామాయణ’ను ప్రకటించిన తర్వాత దేశమంతా దాని గురించి మాట్లాడుకుంది. దానికంటే భారీగా మా సినిమాను ప్రకటించాలని కొన్ని రోజులు ఆపాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. త్రివిక్రమ్- వెంకటేశ్ సినిమా ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత దీని పనులు మొదలవుతాయి” అని అన్నారు.






