నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (Nagaland Governor La Ganesan) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 8న చెన్నైలోని తన నివాసంలో జారిపడి తలకు తీవ్ర గాయమైన ఆయన, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరారు. ICUలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం మరణించారు. 1945 ఫిబ్రవరి 16న తమిళనాడు(Tamilnadu)లోని తంజావూరులో జన్మించిన గణేశన్(80), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) భావజాలంతో చిన్న వయసులోనే ఆకర్షితులై, 1970లో పూర్తిస్థాయి ప్రచారక్గా మారారు.
గణేశన్ మరణంపై ప్రధాని మోదీ సంతాపం
ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరి, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో సేవలందించారు. 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడి(Member of Rajya Sabha)గా ఎన్నికయ్యారు. 2021లో మణిపూర్ గవర్నర్(Governor of Manipur)గా, 2022లో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ 19వ గవర్నర్గా పనిచేశారు. గణేశన్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయనను నిబద్ధత గల జాతీయవాదిగా, తమిళ సంస్కృతి పట్ల అంకితభావం ఉన్న వ్యక్తిగా కొనియాడారు.
Nagaland Governor La Ganesan passed away this evening in Chennai
“He was admitted on 08 August 2025 with a catastrophic intracerebral haemorrhage and coma. All necessary treatments were provided, despite which, his condition failed to improve, leading to his passing away. Our… pic.twitter.com/LIgsLSwkGZ
— ANI (@ANI) August 15, 2025
గణేశన్ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆ రాష్ట్ర బీజేపీ నేత కే. అన్నామలై సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గణేశన్ సేవలు రాజకీయ, సామాజిక రంగాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు కొనియాడారు.






