హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు. త్వరలో తన చిన్న కొడుకు అఖిల్ (Akhil) పెళ్లికి రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. నాగార్జునతో పాటు ఆయన వెంట భార్య అమల కూడా ఉన్నారు. అఖిల్ అరబ్ అమ్మాయి జైనబ్ రవ్జీ తో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరికి నవంబర్ లోనే ఎంగేజ్ మెంట్ అయిపోయింది. ఇప్పుడు జూన్ 6న పెళ్లి జరగబోతోందని టాక్. దీనికి సంబంధించి పెళ్లి డేట్స్ పై త్వరలోనే అధికారికంగా అనౌన్స్ మెంట్ చేయనున్నారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో విభేదాలు..
కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగార్జున (nagarjuna) కు అంత పెద్దగా కలిసిరాలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే ఎన్ కన్వెన్షన్ సెంటర్ బఫర్ జోన్ లో ఉందని దాన్ని వెంటనే కూల్చేయాలని ఆదేశించింది. దీంతో హైడ్రా ఎన్ కన్వెన్షన్
(N Convention) సెంటర్ ను కూల్చివేసింది. అప్పట్లో ఇది పెను సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై పగ బట్టాడని అందరూ విమర్శలు చేశారు. అన్ని ఉన్నా సరైన నిర్మాణమే అయినా కూల్చేశారని ఎక్స్ లో నాగార్జున నిరసన వ్యక్తం చేశారు.
శాలువా కప్పడంతో సద్దుమణిగిన వివాదం
ఆ తర్వాత పుష్ప 2 సినిమా రిలీజ్ అనంతరం జరిగిన తొక్కిసలాట ప్రీమియర్ షోలు బంద్ చేయడంతో తెలుగు సినీ పెద్దలందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) ని కలిశారు. ఆ సమయంలో అక్కినేని నాగార్జున సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. దీంతో అప్పటి నుంచి వారికి మాటలు కలిశాయని అనుకుంటున్నారు. దీంతో చిన్న కొడుకు పెళ్లికి స్వయంగా వెళ్లి సీఎం ను ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కోట్ల విలువ చేసే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినా కూడా ఇలా మళ్లీ కలిసిపోవడం వెనక పెద్ద మతలబే ఉందని సినీ, రాజకీయ ప్రముఖులు చర్చించుకుంటున్నారు.
#AkhilAkkineni to get married with #ZainabRavdjee on June 6th ✅
Akkineni marriage vibes 💥💥 pic.twitter.com/lwJsKBcs8O
— 𝙄 𝘿𝙊𝙉’𝙏 𝙆𝙉𝙊𝙒🤷😎 (@ayyagaareeNo1) May 31, 2025






