ఔరంగజేబు సమాధి వివాదం.. నాగ్‌పుర్‌లో టెన్షన్ టెన్షన్

మహారాష్ట్ర (Maharashtra) శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి (aurangzeb tomb)ని తొలగించాలని డిమాండ్‌ల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం అర్ధరాత్రి నాగ్‌పుర్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో నాగ్‌పుర్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్థానిక పోలీసు కమిషనర్ రవీందర్ కుమార్ సింగల్ చెప్పారు.

అసలేం జరిగిందంటే..

సోమవారం మధ్యాహ్నం మహల్‌ ప్రాంతంలో (Nagpur Riots Updates) ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం వద్ద బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ ప్రదర్శనలో ఓ వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. చిట్నిస్‌ పార్క్, శుక్రవారి తలావ్‌ ప్రాంతాల్లో అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా అధికారులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేశారు.

భద్రత కట్టుదిట్టం

నాగ్‌పుర్‌లోని హంసపురి ప్రాంతంలో కొందరు దుండగులు వాహనాలకు నిప్పంటించి ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడగా అందులో 15 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఘర్షణకు కారకులైన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు  శంభాజీనగర్‌ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు సమాధి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *