టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన సినిమా ‘తండేల్ (Thandel)’. ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న చైతన్యకు ఈ చిత్రం కాస్త ఊరటనిచ్చింది. భారీ వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నమో నమఃశివాయ అనే పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
నమోనమఃశివాయ సాంగ్
అయితే మహాశివరాత్రి సందర్భంగా తండేల్ నుంచి శివుడి పాట వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నమో నమః శివాయ’ (Namo Namah Shivaya) అంటూ సాగిన ఈ పాటలో హీరో హీరోయిన్లు నాగ చైతన్య – సాయి పల్లవి డ్యాన్స్ అదరగొట్టారు. ఎప్పటిలాగే సాయిపల్లవి తన డ్యాన్సుతో ప్రేక్షకులను మైమరిపిస్తే.. నాగచైతన్య కూడా ఆమెకు పోటీనిస్తూ తన స్టెప్పులతో అలరించాడు.
యూట్యూబ్ లో సెన్సేషన్
ఇక ఈ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు లిరిక్స్ అందించారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనురాగ్ కులకర్ణి (Anurag Kulakarni), హరిప్రియ ఈ పాట పాడారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. మత్స్యకారుల జీవితాల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో పాటు భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బుజ్జితల్లి పాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.






