ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి ఫ్యామిలీ ఘన నివాళి

ఎన్టీఆర్‌ వర్ధంతి (NTR Death Anniversary) సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. బాలకృష్ణ (Balakrishna), రామకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR), కల్యాణ్‌ రామ్‌ లు అంజలి ఘటించిన తర్వా.. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.  మరోవైపు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ ఎన్టీఆర్‌కు నివాళి అర్పించనున్నారు.

 

నవరసాలకు అలంకారం

“నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్‌.  నటనకు నిర్వచనం.. నవరసాలకు అలంకారం ఎన్టీఆర్. ఆయన ఒక వర్సిటీ.. జాతికి మార్గదర్శకం. ఎన్టీఆర్‌ లాంటి వారికి మరణం ఉండదు. ఆయన విప్లవాన్ని తీసుకొచ్చారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టింది. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారు.” అని బాలకృష్ణ అన్నారు.

యువతకు ఆదర్శం ఎన్టీఆర్

ఎన్టీఆర్ యువతకు ఆదర్శమని బాలకృష్ణ అన్నారు. నాడు 330కి పైగా తాలూకాలను.. 1000కి పైగా మండలాలుగా విభజించి పాలనను సులభతరం చేశారని గుర్తు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం తీసుకొచ్చి.. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిన ఆ మహనీయుడు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని తెలిపారు. యువత, డాక్టర్లు, ఇంజినీర్లను ఎంతోమందిని ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి తీసుకువచ్చారని బాలకృష్ణ పేర్కొన్నారు.

పేదల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు

‘‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది.. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది.. స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త.. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం’’ అని చంద్రబాబు (AP CM Chandrababu Naidu) ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

ఆయనో ప్రభంజనం

‘‘ఎన్టీఆర్‌ ఒక పేరు కాదు.. ప్రభంజనం.. అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం.. వెండితెరపై రారాజుగా వెలుగొందారు. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి’’ అని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

Related Posts

రాజ్ త‌రుణ్ కాళ్లు పట్టుకుని సారీ చెబుతా : లావ‌ణ్య‌

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) మాజీ ప్రేయసి లావణ్య (Lavanya) వివాదం గతంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మస్తాన్ సాయి అనే యూట్యూబర్ తెరపైకి వచ్చాడు.…

నాగార్జున పరువు నష్టం కేసు.. కోర్టుకు మంత్రి కొండా సురేఖ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), యుంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) విడాకులపై గతంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆమె నాగార్జున కుటుంబంపైనా కాంట్రవర్సియల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *