
నటసింహం బాలకృష్ణ(Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ(Akhanda)’ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇదే జోష్‌లో వీరిద్దరూ ‘అఖండ-2(Akhanda2)’ మొదలెట్టేశారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మిగతా షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తోంది BB4 టీమ్.. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), కావ్యా థాపర్, జగపతి బాబు, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాలయ్య-బోయపాటి ప్లాన్ అదేనా..
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ విడుదల తేదీ(Release Date) మారినట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం సెప్టెంబర్ 25కి థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ ఆ సమయానికి షూటింగ్, VFX తదితర పనులు పూర్తయ్యే ఛాన్స్ లేదట. పైగా ఫెస్టివల్ సీజన్ కావడంతో కలెక్షన్ల పరంగానూ మూవీకి బెనిఫిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో ఈ మూవీని 2026 సంక్రాంతి(Sankranthi 2026)కి బరిలో నిలపాలని బాలయ్య-బోయపాటి కాంబో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో
ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య బాబు ‘అఖండ 2’కు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాలకృష్ణను పవర్ ఫుల్ పాత్రకోసం రెడీ చేస్తున్నట్లు కనిపించింది. కాగా దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్(SS Thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని(Tejaswini) సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది.
High Octane Divine action sequence shoot completed under the choreography of Stunt Master Ravi varma🔥#JaiBalayya #NandamuriBalakrishna #Akhanda2 #AkhandaThandavam #GodofMassesNBKpic.twitter.com/PQlJWcgtNs
— చిలకలూరిపేట వేటగాడు😎 (@CHILAKALURIPET_) April 18, 2025