
వరుస సినిమాలతో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన జోరు సాగిస్తున్నారు. యంగ్ హీరోలకు దీటుగా వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన బాలయ్య ఆ తర్వాత బోయపాటి శ్రీను కాంబోలో అఖండ-2 (Akhanda 2) చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుందని టాక్. అయితే ఈ చిత్రం సెట్లో ఉండగానే బాలయ్య తన నెక్స్ట్ ఫిల్మ్ ఓకే చేసినట్లు సమాచారం.
బాలయ్య నెక్స్ట్ సినిమా ఎవరితో?
అఖండ-2 తర్వాత బాలకృష్ణ ఎలాంటి సినిమాతో వస్తారని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఆయన గోపిచంద్ మలినేని, హరీశ్ శంకర్(Harish Shankar)లలో ఎవరో ఒకరితో చిత్రం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య-గోపిచంద్ మలినేని (Gopichand Malineni)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇప్పటికే గోపిచంద్ బాలయ్య బాబుకు కథ కూడా వినిపించేశారట. ఈ సినిమా అధికారిక ప్రకటన జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజున రానున్నట్లు తెలిసింది.
మరోసారి మాస్ కాంబో రిపీట్
ఇక బాలకృష్ణ- గోపిచంద్ మలినేని కాంబోలో ఇప్పటికే వీరసింహారెడ్డి (Veera Simhareddy) అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో బాలయ్య లుక్, పాత్ర, పవర్ ఫుల్ డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో బాలయ్యకు మరో హిట్ అందించిన గోపిచంద్ కు మరో ఛాన్స్ ఇవ్వాలని ఈ నందమూరి హీరో భావించారట. ఈ క్రమంలోనే ఈ మాస్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో చిత్రానికి ఓకే చెప్పారట. ఈ మాస్ కాంబోలో రాబోతున్న మరో సినిమా ఊర మాస్ గా ఉండనున్నట్లు సమాచారం.