Netflix OTT: బాలయ్య ఫ్యాన్స్‌కు పండగే.. ‘డాకు మహారాజ్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్. నటసింహం బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కన మూవీ “డాకు మహారాజ్(Daaku Mahaaraj). సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఈ మూవీ రికార్డులు కొల్లగొట్టి బాలయ్య కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) కీలకపాత్ర పోషించింది. స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్‌లో మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో OTT కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.

అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్

నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “డాకు మహారాజ్” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈమేరకు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న Netflix స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈనెల 21 నుంచే OTTలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. ‘అనగ నగా ఒక రాజు.. చెడ్డవాళ్లందరూ డాకు అనేవాళ్లు.. మాకు మాత్రం మహారాజ్’ అంటూ సోషల్ మీడియా(SM) వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. కాగా ఈ మూవీ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *