Arjun S/o Vyjayanthi.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram), లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijaya Shanthi) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun S/o Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహించిన ఈ సినిమాని అశోకా క్రియేషన్స్, NTR ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్‌తో కలిసి అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. కత్తి మూవీ తర్వాత NKR చాలా గ్యాప్ తర్వాత ఒక మాస్ మసాలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాయీ మంజ్రేకర్(Saiee Manjrekar) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

మొదటి షో నుంచి టాక్ పాజిటివ్ రెస్పాన్స్

మొదటి షో నుంచి టాక్ పాజిటివ్ గానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మూవీని చూసిన నెటీజన్స్ సోషల్ మీడియా(SM) ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అటు US ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూలు(Reviews), అభిప్రాయాలు పాజిటివ్‌గానే ఉన్నాయి. మొత్తానికి కళ్యాణ్ రామ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పబ్లిక్ రివ్యూ ఎలా ఉందంటే..?

బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పక్కా..

నందమూరి అభిమానులకు ఇది మాస్ ట్రీట్.. ఈ సినిమా హిట్ కావడం తథ్యం. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకు బలంగా నిలవడమే కాకుండా అదరగొట్టేలా ఉంటాయని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పక్కా.. తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో పాటుగా పవర్ ఫుల్ పోలీసు యాక్షన్ సన్నివేశాలు(Actions Scenes) గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సూపర్ హిట్ అని ఒకరు ట్వీట్ చేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత లేడీ సూపర్ స్టార్‌ విజయశాంతిని చూడటం చాలా సంతోషంగా ఉందని హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *