
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఓ పర్సనల్ అకౌంట్(Personnel Account)ను మెయింటైన్ చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ అకౌంట్‌లో కేవలం సెలబ్రిటీలు(Celebraties) మాత్రమే ఉంటారని, వారితో బన్నీ(Bunny) అక్కడ ఇంటరాక్ట్ అవుతుంటారని అంతా చెబుతుంటారు. SMలో అన్నీ గమనిస్తారని అంటుంటారు. అయితే ఇప్పుడు @bunny_boy_private అనే పేరుతో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కనపడడం చర్చనీయాంశంగా మారింది. ఆలోచించకుండా యాదృచ్ఛిక విషయాలు అంటూ బయో(Bio)లో రాసి ఉంది. అదే సమయంలో ఆ అకౌంట్‌ను హీరోయిన్ సమంత(Samanta), రానా(Rana), త్రిష (Trisha) సహా పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు.
స్పందించని అల్లు అర్జున్ అండ్ టీమ్
దీంతో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. నిజానికి.. అల్లు అర్జున్ మరో ఇన్‌స్టా అకౌంట్‌ను యూజ్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా… అకౌంట్ ఐడీ(Account ID) తెలియదు. బన్నీ వాడడం మాత్రం నిజమేనని అంటున్నారు. అయితే ఇప్పుడు @bunny_boy_private అనే పేరుతో ఉన్న అకౌంట్ అల్లు అర్జున్ దేనని చెబుతున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం కాదేమోనని అంటున్నారు. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ అండ్ టీమ్ స్పందించాల్సి ఉంది. కాగా బన్నీ ఇటీవల పుష్ప-2తో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు చేస్తున్నాడు.