Naga Chaitanya: స్టైలిష్ లుక్‌లో చైతూ.. ‘NC24’ షూటింగ్ షురూ

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Mondeti) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఫుల్ ఖుషీలో ఉన్నా చైతూ.. అదే జోష్‌లో తన కొత్త సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ‘NC24’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇలా షూట్ మొదలైందో లేదో లీక్ వీరులు చైతూ మూవీ నుంచి అప్డేట్ ఇచ్చేశారు..

చైతూ ఇదివరెప్పుడూ చేయని రోల్‌

‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు(Kartheek Dandu) డైరెక్షన్లో నాగ చైతన్య 24వ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో దీనిని రూపొందిస్తున్నారు. గతేడాది చైతూ బర్త్ డే సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి ప్రీ లుక్ పోస్టర్‌(Pre Look Poster)ను కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. చైతూ ఇదివరెప్పుడూ చేయని రోల్‌లో కనిపించనున్నాడు. ‘తండేల్(Thandel)’ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అయిన నాగ చైతన్య.. ‘NC 24’ మూవీ కోసం తన లుక్‌ని పూర్తిగా మార్చేశాడు. స్టైలిష్ లుక్‌(Stylish Look)లో కనిపిస్తున్నాడు. ఆయన న్యూ లుక్‌కి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియా(SM)లో చక్కర్లు కొడుతోంది.

నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో

నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలో నాగచైతన్య కలర్ ఫుల్ షర్ట్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇది అతని కెరీర్ లోనే మోస్ట్ స్టైలిష్ లుక్ అని చెప్పాలి. గడ్డం, మీసాలను కాస్త ట్రిమ్ చేసి షార్ట్ హెయిర్‌తో ఉన్న ఈ లుక్ అక్కినేని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘NC 24’ సినిమాలో చైతూ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Choudari) హీరోయిన్‌గా నటిస్తోంది.

Image

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *