
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా, యంగ్ డైరెక్టర్ శైలేశ్ కొలను(Director Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందిన ‘హిట్ 3(HIT3)’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మే డే సందర్భంగా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు(Collections) సాధించి, నాని కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచిన ‘హిట్ 3’.. విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్(Positive Talk)ను సొంతం చేసుకుంది.
నాని కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు
కొన్ని వర్గాల నుంచి హింసాత్మక సన్నివేశాలు(Violent scenes) అధికంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ, అది సినిమా కలెక్షన్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ‘హిట్ 3’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్ల గ్రాస్ కలెక్షన్లను(Gross Collections) రాబట్టింది. ఈ మేరకు చిత్ర బృందం ఒక అధికారిక పోస్టర్(Poster)ను కూడా విడుదల చేసింది. దీంతో నాని కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘హిట్ 3’ రికార్డు సృష్టించింది. శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీజే మేయర్(Mickey J. Meyer) మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.
May this just be the beginning. Go catch the action on the big screen if you haven’t yet. It will be worth your time. pic.twitter.com/Id2VaXD6s6
— Sailesh Kolanu (@KolanuSailesh) May 2, 2025