నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా.. శైలష్ కొలను(Sailesh Kolanu) డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3 ది థర్డ్ కేస్(HIT: The Third Case)’. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్(Teaser), ట్రైలర్(Trailer)లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ‘అబ్ కీ బార్ అర్జున్ సర్కార్’ అనే సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికీ టాప్-10 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీంతో డైరెక్టర్ శైలేష్ కొలను పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్లు(Promotions) జోరుగా కొనసాగుతున్నాయి.
#HIT3 Hindi Version Censor Certificate Complete..
☆ Certificate – A
☆ Runtime – 2 hr 37 min 36 sec#HIT3FromMay1st In Cinemas.#HIT3TheThirdCase pic.twitter.com/pYlgaHWUhD— South HD Updates (@SouthHDUpdates) April 24, 2025
వయలెన్స్ ఎక్కువుండటంతో ‘A’ సర్టిఫికెట్
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘హిట్-3’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 1న గ్రాండ్ రిలీజ్ (Release)కు మేకర్స్ ప్లాన్ చేశారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. హిట్-3కి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. వయలెన్స్(Violance) ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు(Censor Board) ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2.37 గంటలుగా ఉందట. ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే కంటెంట్ ఉండటంతో వారికి ఎక్కడా బోర్ కొట్టదని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ మూవీలో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీజే మేయర్(Mickey J. Meyer) మ్యూజిక్ అందించారు.






