తెలంగాణ(Telangana) రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy)కి పెనుప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా రాత్రి 8:45 గంటల సమయంలో ఖమ్మం(Khammam) జిల్లా తిరుమలాయపాలెం మండలకేంద్రం సమీపంలో కారు రెండు టైర్లు ఒక్కసారిగా(Blast Car Tyres) పేలాయి. దీంతో కారు అదుపు తప్పింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. కారులో నుంచి దిగిన మంత్రి ఎస్కార్ట్ వాహనం(Escort Vehicle)లో ఖమ్మం క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. కాగా ప్రమాద సమయంలో మంత్రితోపాటు భద్రాచలం MLA తెల్లం వెంకట్రావ్, DCCB డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నట్లు సమాచారం.








