కేంద్ర ప్రభుత్వం(Central Govt) 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల(71st National Film Awards)ను ఘనంగా ప్రకటించింది. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులు, వివిధ భాషల్లో విడుదలైన చిత్రాల్లో సృజనాత్మకత, సాంస్కృతిక ప్రాముఖ్యత, సాంకేతిక శ్రేష్ఠతను గుర్తించి సత్కరిస్తాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) నిర్వహణలో, 22 భాషల్లో 115 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ, ఉత్తమ చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసింది.

జాతీయ ఉత్తమనటుడిగా షారుఖ్ ఖాన్
కాగా 2023 సంవత్సరానికి గానూ ’12th ఫెయిల్’ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం(National Best Film)గా ఎంపికైంది. జాతీయ ఉత్తమనటుడు అవార్డును షారుఖ్ ఖాన్ (Jawan), విక్రాంత్ మాసే (12th ఫెయిల్) పంచుకున్నారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (Mrs. Chatterjee vs. Norway) పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక, నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి(Nandamuri Balakrishna-Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి(Bhagavanth Kesari)’ చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రం(Best movie in telugu)గా నిలిచింది. జాతీయ ఉత్తమ కన్నడ చిత్రంగా ‘కండీలు’, జాతీయ ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్(Parking)’ ఎంపికయ్యాయి. జాతీయ ఉత్తమ హిందీ చిత్రం ‘కథల్’ ఎంపికైంది. ఇక, జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ సినిమా కేటగిరీలో ‘హనుమాన్’ అవార్డుకు ఎంపికైంది.

‘ఉరు-పల్లెటూరు’ పాటకు జాతీయ అవార్డు
జాతీయ ఉత్తమ సినీ గీతంగా తెలుగు పాట ఎంపికవడం విశేషం. బలగం సినిమా(Balagam Movie)లోని ‘ఉరు-పల్లెటూరు’ అంటూ సాగే పాటకు జాతీయ పురస్కారం దక్కింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్(Kasarla Shyam) సాహిత్యం అందించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్(AR Rahman) మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ (వాత్తి) అవార్డుకు ఎంపికయ్యారు.

జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా సాయి రాజేశ్ ఎంపికయ్యారు. సూపర్ హిట్టయిన ‘Baby’ చిత్రానికి గాను ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. అంతేకాదు, ‘బేబీ’ చిత్రానికి గాను పీవీఎన్ఎస్ రోహిత్ జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డుకు ఎంపికయ్యారు. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) విజేతలకు అవార్డులను అందజేయనున్నారు.
71st #NationalFilmAwards complete winners list: @iamsrk, @VikrantMassey share #BestActor; #RaniMukerji wins #BestActress https://t.co/7naGCLe1F5 pic.twitter.com/Ni5j64FrM9
— Urban Asian (@UrbanAsian) August 1, 2025






