JNV Result 2025: ‘నవోదయ’ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్

దేశంలోని నవోదయ విద్యాలయా((Navodaya Vidyalaya)ల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి(Navodaya Vidyalaya Samiti) ఇవాళ (మార్చి 25) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ https://cbseit.in/cbse/2025/nvs_result/Result.aspxలో ఫలితాల(Results)ను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ప్రవేశ పరీక్ష రూల్ నెంబరు(Roll Number), పుట్టినతేదీ(Date of Birth) వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు ఇంటర్‌(Inter) దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం(food) కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. 8వ తరగతి వరకు మాతృ భాష లేదా ప్రాంతీయ భాషలో విద్య అభ్యసించవచ్చు. 9వ తగరతి నుంచి ఇంగ్లిష్ మీడియం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు.

APలో 15, తెలంగాణలో 9

అంతేకాదు ఈ విద్యాలయాల్లో రెగ్యులర్‌ చదువుతోపాటు NEET, JEE వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా(కొన్ని పర్వత ప్రాంతాలు మినహా) జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు, పర్వత ప్రాంతాల్లో ఏప్రిల్ 12న నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ జవహర్‌ నవోదయాలు దేశవ్యాప్తంగా 649 ఉన్నాయి. వీటిలో APలో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. వీటన్నింటిలో దాదాపు 48 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Related Posts

JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…

TG TET: తెలంగాణ టెట్​ రిజల్ట్స్​ వచ్చేశాయ్​..

తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్​ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *