ManaEnadu : బిగ్‌బాస్ సీజన్-8 (Bigg Boss 8 Telugu) తొమ్మిదో వారం పూర్తి చేసుకుంది. ఈ వారం హౌసు నుంచి నయని పావని (Nayani Pavani) ఎలిమినేట్ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో చివరి వరకూ నయని పావని, హరితేజ నిలిచారు. అయితే నయని పావనికి తక్కువ ఓట్లు వచ్చినందున తనను ఎలిమినేట్ చేస్తున్నట్లు హోస్టు నాగార్జున (Nagarjuna) ప్రకటించారు.
బెస్ట్ ఎవరు.. డమ్మీ ఎవరు
అనంతరం ఆమె బిగ్ బాస్ హౌసు నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత వేదికపైకి వచ్చిన ఆమె తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయింది. హౌస్‌లో (Bigg Boss Telugu) ఉన్న వాళ్లలో ఐదుగురు డమ్మీ ఆటగాళ్లు, ముగ్గురు బెస్ట్ ఆటగాళ్లు ఎవరో చెప్పాలని నాగార్జున అడిగారు. దానికి ఆమె తన అభిప్రాయం ప్రకారం బెస్ట్ ఎవరో.. డమ్మీ ఎవరో చెప్పేసి షో నుంచి నిష్క్రమించింది.
నీలో ఆ ఫైర్ ఉంది
అందరితో పోల్చుకుంటే గేమ్ ఆడటం వయసురీత్యా గంగవ్వకు కష్టమని నయని (Nayani Pavani Elimination) చెప్పుకొచ్చింది. ఇక రోహిణి గురించి మాట్లాడుతూ ఆమె సేఫ్‌గా ఆడుతోందని.. వెనకాల మాట్లాడకూడదని.. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా బాగున్నా.. సింగిల్‌గా ఆడాలని తెలిపింది. ప్రేరణ.. కోపంలో తెలియకుండా కొన్ని పదాలు మాట్లాడుతుందని పేర్కొంది. నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే ఎలా అనిపిస్తుందో.. నీ మాటల వల్ల ఎదుటి వాళ్లకూ అలాగే ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అని సూచించింది.
అందరి కన్నా అతను చాలా హానెస్ట్
ఇక గౌతమ్ గురించి మాట్లాడుతూ.. ఒకరి నుంచి మనం ఏదైనా ఆశిస్తున్నామంటే అదే స్థాయిలో మనం కూడా ఇవ్వాలి. ఆ విషయంలో కొంచెం కంట్రోల్ లో ఉండాలని చెప్పుకొచ్చింది. విష్ణు ప్రియ గేమ్ బాగా ఆడుతుందని.. ఇంకా బాగా ఆడాలని ఎంకరేజ్ చేసింది నయని పావని. హరితేజ(Hariteja)లో ఫైర్ ఉందని.. గత వారం చూపించిన ఫైర్ ముందుముందు ఇంకా చూపించాలని తెలిపింది. ఇక నిఖిల్ మంచి వ్యక్తి అని.. బయటకు కోపంగా ఉన్నా.. చిన్న పిల్లాడి మనస్తత్వం అని పేర్కొంది. పృథ్వీ అందరి కన్నా నిజాయతీ కలిగిన వ్యక్తి అని చెప్పి హౌసు నుంచి నిష్క్రమించింది నయని.







