నయనతార(Nayanatara).. లేడీబాస్‌గా సినీఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ మూవీ(Lady oriented movies)ల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంటోంది. దీంతో నయన్‌కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. చంద్రముఖి(Chandeamukhi)గా అలరించినా.. ‘సీత’గా ఆకట్టుకోవడంలోనూ ఆమెకు ఆమెసాటి. తాజాగా నయనతారా నటించిన ఓ మూవీపై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. నయన్ నటించిన ‘టెస్ట్(Test)’ సినిమా థియేటర్లో విడుదలకి దూరంగా ఉండిపోయింది. దాంతో ఈ సినిమా టీమ్ నేరుగా OTTకి తీసుకొచ్చే ప్లాన్ చేసింది.
అఫీషియల్ పోస్టర్ రిలీజ్
ఫలితంగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు పేర్కొంటూ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్(Poster Release) చేశారు. డైరెక్టర్ శశికాంత్(Director Shashikant) దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా(Sports Drama)గా ఈ మూవీ తెరకెక్కింది.
@ActorMadhavan sir nadikkum #Test movie Only OTT la @Netflix_INSouth la Steaming from April 4th@NayantharaU #Siddharth pic.twitter.com/AfQyVUM1iI
— Dhanushksdurai Cinema Official (@dhanushksdurai) March 6, 2025
కీలక పాత్రల్లో మాధవన్, సిద్ధార్థ్
నయనతారతో పాటు మాధవన్(Madhavan), సిద్ధార్థ్(Siddharth) కీలకమైన పాత్రలను పోషించగా, ప్రత్యేకమైన పాత్రలో మీరా జాస్మిన్(Meera Jasmine) కనిపించనుంది. చెన్నై క్రికెట్ స్టేడియంలో టీమ్ఇండియా(Team India) టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి చిక్కుల్లో పడతారు? ఆ చిక్కులలో నుంచి బయటపడటానికి ఏం చేస్తారు? అనేది కథ. మరి డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ఈ మూవీ అభిమానులను ఏ మేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందే.






