Mana Enadu: నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ(Director Bobby) కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘NBK 109’. తాజాగా సినిమాకి సంబంధించి అప్డేట్‌ను మూవీ టీం అనౌన్స్ చేసింది. ఈ చిత్ర టైటిల్ & టీజర్(Title & Teaser)ను ఈనెల 15న ఉదయం 10.24గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి(Sankranthi)కి ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో బాలయ్య నెక్స్ట్ సినిమా టైటిల్, టీజర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో అని అభిమానులు(Fans) ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
విభిన్న పాత్రల్లో కనిపించనున్న బాలయ్య!
ఇక ‘NBK 109’ విషయానికి వస్తే, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్(Mass action entertainer)గా రూపొందుతోంది. ఈ మూవీలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela), చాందినీ చౌదరి(Chandni Chaudhary) లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్(Bobby Deol) విలన్ రోల్లో మెరవనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Taman) సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు.
The much-awaited is ready to strike! #NBK109 Title & Teaser will be out on @ :
Sankranthi 2025, In Cinemas Worldwide.
#NandamuriBalakrishna @dirbobby @MusicThaman @thedeol @ItsMePragya… pic.twitter.com/6BbayEbUj5
— Sithara Entertainments (@SitharaEnts) November 12, 2024
మాస్ డైరెక్టర్‌తో నాలుగోసారి
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘NBK 109’తో పాటు ‘BB4’ (Balakrishna-Boyapati 4) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నాలుగోసారి కలిసి పనిచేయనున్నారు బాలయ్య. దసరా సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తుండగా, బాలయ్య కుమార్తె తేజస్వి(Balayya’s daughter Tejaswi)ని కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.






