మూవీ ప్రియులకు(For movie lovers) ఈ ఏడాది సినీనామ సంవత్సరం కానుంది. థియేటర్ల(Theatres)లో సినిమా చూడని వారు.. బిజీ షెడ్యూల్ వల్ల తమ అభిమాన హీరో మూవీలు మిస్ అయినవారు.. ఇతర కారణాలతో సినిమా హాళ్లలో కొత్త చిత్రాలు చూడనివారికి ఈ ఏడాది పండగే. ఎందుకంటే ప్రముఖ OTT సంస్థ Netflix ఈ సంవత్సరం OTTలోకి తీసుకురానున్న సినిమాల లిస్ట్(List of movies)ను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలను స్ట్రీమ్ చేస్తూ జనాదరణ పొందుతున్న ఈ సంస్థ మరికొన్ని సినిమాల్ని స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైంది.
విడుదలకు ముందే ఓటీటీ హక్కులు సొంతం
వరుసగా ప్రాంతీయ చిత్రాల్ని విడుదల చేస్తే క్రేజ్ పెంచుకుంటున్నNetflix త్వరలో మరి కొన్ని కొత్త సినిమాలు విడుదల చేయనుంది.2024లో సైతం బాక్సాఫీస్ హిట్ మూవీల్ని(Box office hit movies) విడుదల చేసింది. ఇప్పుడు మరి కొన్ని సినిమాల్ని స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. సాధారణంగా మూవీ విడుదలైన తర్వాత OTT ప్రకటన చేస్తుంటారు మూవీ మేకర్స్. కానీ ఈసారి సినిమాలు రిలీజ్ అవకముందే పలు కొత్త మూవీల ఓటీటీ హక్కుల్ని(OTT rights) సొంతం చేసుకుంది. అయితే ఈ ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్(Theatrical run) తరువాతే ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్‌లో వివిధ తేదీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
స్ట్రీమింగ్ కానున్న సినిమాలివే..
ఈ జాబితాలో పవన్ కళ్యాణ్-ప్రియాంక మోహన్ నటించిన OG, నాగచైతన్య-సాయి పల్లవి నటించిన తండేల్, రవితేజ-శ్రీలీల నటించిన మాస్ జాతర, నాని-శ్రీనిధి శెట్టి నటించిన HIT-3, విజయ్ దేవరకొండ-భాగ్యశ్రీ బోర్సే నటించిన VD12, సంగీత్ శోభన్-నార్నే నితిన్, రామ్ నితిన్ నటించిన Mad Square, సిద్ధూ జొన్నలగడ్డ-వైష్మవి చైతన్య నటించిన జాక్, ప్రియదర్శి-సాయి కుమార్ నటించిన కోర్ట్ సేట్ వర్సెస్ ఏనీబడి, నవీన్ పోలిశెట్టి-మీనాక్షి చౌదరి నటించిన అనగనగా ఒకరాజు సినిమాలున్నాయి. ఇవింకా థియేటర్‌లో విడుదల కాలేదు. కానీ స్ట్రీమింగ్ ప్రకటన మాత్రం వచ్చేసింది.
Upcoming South Movies on Netflix India 💥🔥 pic.twitter.com/E8HVcuDm9U
— Cine 4 Updates (@Cine4Updates) January 14, 2025







