రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాజికల్ మాస్ కాంబో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ సూపర్ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ కానుంది. గతంలో రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందించింది. హరీష్ శంకర్ దర్శకుడిగా పరిచయమైంది కూడా ఈ సినిమా తోనే . ఈ సూపర్ హిట్ పెయిర్ మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో రవితేజ హీరోగా ముచ్చటగా మూడో చిత్రం చేయబోతున్నారు. మ్యాజికల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కనుంది. పీరియాడిక్ డ్రామా త్రిల్లర్ గా ఈ స్టోరీ ఉండబోతున్నట్లు తెలిసింది. ఇటీవలే హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. త్వరలో రాబోతున్న ఈ సినిమాతో చరిత్ర తిరగరాయబోతున్నామని తెలిపారు. దీంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. సిల్వర్ స్క్రీన్ పై కొందరి హీరో, డైరెక్టర్స్ కాంబినేషన్ కు ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులో రవితేజ, హరీష్ శంకర్ కాంబో ఒకటి. ఇక వీరిద్దరి మ్యాజికల్ మాస్ కాంబో రిపీట్ కానుంది అని తెలియగానే అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
ప్రస్తుతం రవితేజ రవితేజ(Ravi Teja) కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈగల్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తవగానే రవితేజ సినిమాతో రెడీగా ఉన్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.