మన ఈనాడు:కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రభుత్వం పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. పదేండ్ల తరువాత కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నిబంధనలు ఇలా ఉన్నాయి .. గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించబోతున్నారు.
*గతంలో రేషన్ కార్డు ఉండి ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడితే అనర్హులే.
*గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్నవారే అర్హులు.
*మాగాణి 3.5 ఎకరాలు, బీడు భూములైతే 7.5 ఎకరాలు.
*గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం.
-*100 చ.మీ ఇల్లు, ఫ్లాట్, కారు, ట్రాక్టర్, ఏడాదికి రూ.1.5 లక్షల కంటే.
*ఆదాయం ఎక్కువ ఉంటే రేషన్ కార్డు సరెండర్ చేయాల్సిందే.!
*ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్‌కంట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ చెల్లించినా అనర్హులే.
*డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేషన్ కార్డుకు అనర్హులే.
తెలంగాణలో 2014 నుంచి రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. సంక్షేమ పథకాల అమలులో రేషన్ కార్డే కీలకం కావడంతో కొత్త ప్రభుత్వం రావడంతో జనాల్లో ఆశలు పెరిగాయి. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు రూ. 2500, విద్యార్థులకు రూ.5లక్షల భరోసా పథకానికి, రూ.10లక్షల ఆరోగ్యబీమాకు రేషన్ కార్డు కంపల్సరీ. అయితే వారి ఆశలకు ఎలాంటి భంగం కలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో చెప్పిన ఆరు గ్యారెంటిలో రెండిటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది.