Google Loans: గూగుల్ పే‌తో అకౌంట్లోకి రూ.15 వేల వరకు పొందండి.. ఈఎంఐ రూ.111 నుంచి..

మన ఈనాడు:మీరు గూగుల్ పే వాడుతున్నారా? అయితే శుభవార్త. గూగుల్ అదిరే తీపికబురు అందించింది. గూగుల్ పే ద్వారా స్మాల్ బిజినెస్‌లకు సాచెట్ లోన్స్ అందిస్తామని ప్రకటించింది. స్మాల్ లోన్స్ సులభంగా అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. గూగుల్ పే యాప్‌లో సాచెట్ లోన్స్ ఆవిష్కరించింది. ఇందులో భాగంగా చిరు వ్యాపారులు తక్కువ మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. రూ. 15 వేల వరకు లోన్ పొందొచ్చని గూగుల్ తెలిపింది. అలాగే సాచెట్ లోన్స్‌కు సంబంధించి ఈ రుణాలను కేవలం రూ.111 నుంచి రీపేమెంట్ అమౌంట్‌తో తిరిగి చెల్లించొచ్చని పేర్కొంది.

ఈ తరహా రుణాలకు డీఎంఐ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గూగుల్ తెలిపింది. అంతేకాకుండా వ్యాపారులకు ఇపేలేటర్ ద్వారా క్రెడిట్ లైన్ కూడా అందుబాటులో ఉంచుతామని గూగుల్ తెలిపింది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. స్టాక్, సప్లై కోసం ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ డిస్ట్రిబ్యూటర్స్ వద్ద ఉపయోగించుకోవచ్చని వివరించింది.

మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. బ్యాంక్ అకౌంట్లలోకి రూ.30 వేలు, ఇలా చేస్తే చాలు!
గూగుల్ ఇండియా ఇప్పటికే యూపీఐ క్రెడిట్ లైన్స్‌ను ఆవిష్కరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో ఈ సర్వీసులు తెచ్చింది. అలాగే గూగుల్ ఇండియా తన పర్సనల్ లోన్ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించింది. యాక్సిస్ బ్యాంక్‌తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెలకు రూ.30 వేల కన్నా తక్కువ ఆదాయం కలిగిన వారికి గూగుల్ పే ద్వారా ఎక్కువగా రుణాలు లభించాయని కంపెనీ పేర్కొంటోంది. టైర్ 2 పట్టణాల్లోని వారు ఎక్కువగా రుణాలు పొందుతున్నారని తెలిపింది. గూగుల్ పే ఆర్‌బీఐ ఆమోదం పొందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే కస్టమర్లకు రుణాలు అందిస్తోంది.

కాగా ప్రస్తుతం ఆన్‌లైన్ లోన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో లోన్ తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. అందువల్ల ఆన్‌లైన్‌లో లోన్ తీసుకునే ముందు అన్ని వివరాలు చెక్ చేసుకోండి. ఆర్‌బీఐ అనుమతి పొందిన లోన్ యాప్స్ ద్వారా రుణం పొందడం ఉత్తమం. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. కేవలం వ్యాపారులు మాత్రమే కాకుండా గూగుల్ పే యూజర్లు కూడా లోన్స్ పొందొచ్చు. క్రెడిట్ స్కోర్ బాగున్న వారు ఈజీగా లోన్ పొందే వెసులుబాటు ఉంటుంది. దీని కోసం మీరు గూగుల్ పే యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ లోన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత మీరు లోన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఎలిజిబిలిటీ ఆధారంగా మీకు వచ్చే లోన్ అమౌంట్ ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్ సరిగా లేకపోతే లోన్ రాకపోవచ్చు.

Related Posts

Mobile Market: వివో దెబ్బకు శామ్‌సంగ్ డౌన్.. మొబైల్ కంపెనీ ర్యాంకింగ్స్ ఇవే!

మొబైల్ ఫోన్.. ప్రస్తుత టెక్ యుగం(Smartphone Market)లో దాని వ్యాల్యూ ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిత్యం మార్కెట్లోకి వందలాది కంపెనీలు లాంచ్ అవుతున్నాయి. కానీ ఎన్ని కొత్త బ్రాండ్(New Brands) కంపెనీలు వచ్చినా.. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత…

Today Gold Rates: స్థిరంగా బంగారం ధర.. తగ్గిన సిల్వర్ ప్రైస్

గత నాలుగైదు రోజులుగా పెరిగిన బంగారం ధరలు(Gold Price) కొనుగోలుదారులను హడలెత్తించాయి. దేశీయంగానూ నిన్నటి వరకు పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డు గరిష్ఠాల్లోనే ట్రేడవగా పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. అయితే ఎట్టకేలకు ఇవాళ (ఫిబ్రవరి 8) శాంతించాయని చెప్పొచ్చు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *