ధూమ్(Dhoom).. బాలీవుడ్(Bollywood)లో ది మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్‌లలో దీనికి ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే వచ్చి మూడు సిరీస్‌లు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ధూమ్‌లోని దోపిడీ సీన్స్, అందులో హృతిక్ రోషన్(Hrithik Roshan) చేసే స్టంట్స్ ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధూమ్ సిరీస్(Dhoom Series)లో ఉండే మ్యాజిక్ ఏంటంటే ఈ సిరీస్‌లో వచ్చే సినిమాలలో హీరోలంటూ ఉండరు. విలన్ క్యారెక్టర్‌కు హీరోయిజం జోడించి తెరకెక్కించడం ధూమ్ సిరీస్ స్పెషల్.

హృతిక్ విన్యాసాలకు ఇప్పటికీ తగ్గని క్రేజ్
ఇప్పటికే వచ్చిన మూడు పార్టులలో ఫస్ట్ సిరిస్‌లో జాన్ అబ్రహం(John Abraham), ధూమ్-2లో హృతిక్ రోషన్(Hrithik Roshan), ధూమ్-3లో అమీర్‌ఖాన్(Aamir Khan) విలన్ రోల్స్‌లో కనిపించారు. అయితే ఈ మూడు సిరీస్‌లలో హైలైట్‌గా నిలిచింది మాత్రం హృతిక్ చేసిన విన్యాసాలే, వాటికి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. తాజాగా Dhoom-4పై బీటౌన్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) డైరెక్షన్‌లో ఈ సిరీస్ తెరకెక్కనుంది. అయితే హీరో ఎవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. రాక్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) పేరు తెరపైకి వచ్చింది. అలాగే రణవీర్ సింగ్(Ranveer Singh) పేరు కూడా వినిపించింది. తాజాగా వీళ్లిద్దరితో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కూడా రేసులో నిలిచాడు.
ప్రస్తుతం SSMB29తో మహేశ్ ఫుల్ బిజీ
ధూమ్ సిరీస్‌లో మహేశ్ కటౌట్ కనిపించడమే పెద్ద సంచలన మవుతుంది. ప్రస్తుతం SSMB29తో మహేశ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ రాజమౌళి(Director Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దీనికి చాలా సమయం పట్టనుంది. అయితే ధూమ్-4కు దాదాపు రెండేళ్లు పట్టనుండటంతో ఆలోపు మహేశ్ కూడా ఫ్రీ అవుతాడని, దాంతో ధూమ్ సిరీస్‌లో ప్రిన్స్ కూడా ఎంట్రీ ఇస్తాడని బీటౌన్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నిజంగా మహేశ్ ఎంట్రీ ఇస్తే ధూమ్ 4 నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.







