కరీబియన్ విధ్వంసక వీరుడు నికోలస్ పూరన్ (Nicholas Pooran) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ప్రకటించేశాడు. ఇన్స్టాగ్రామ్లో వేదికగా పోస్ట్ చేస్తూ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. ఇది ఎంతో కఠిన నిర్ణయమని, అన్నీ ఆలోచించిన తర్వాత ఈ డెసిషన్ తీసకున్నానన్నాడు. క్రికెట్ అంటే తనకు ప్రాణమని, ఈ ఆట తనకు ఎన్నో మర్చిపోలేని అనుభూతులు ఇచ్చిందన్నాడు. వెస్టిండీస్ జెర్సీ వేసుకొని దేశం కోసం ఆడడం ఎప్పటికీ గౌరవమేనని అన్నాడు. తనకు అండగా నిలిచి ప్రేక్షకులు, టీమ్ మేట్స్, ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలిపాడు.
2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం
2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పూరన్.. వెస్టిండీస్ తరఫున 61 వన్డేలు ఆడి 1983 పరుగులు చేశాడు. ఇక 106 టీ20ల్లో 2,275 రన్స్ చేశాడు. 9 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో తన జట్టును గెలిపించాడు ఈ కరీబియన్ స్టార్. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉండి కూడా ఇంటర్నేషనల్ క్రికెట్కు హఠాత్తుగా అతడు రిటైర్‌మెంట్ ప్రకటించడం షాక్కు గురిచేస్తోంది. ఇటీవలే విండీస్ టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన ఆటగాడు.. ఇలా హఠాత్తుగా తప్పుకోవడం ఏంటని విస్మయానికి లోనవుతున్నారు. మరో 8 నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉండగా ఈ టైమ్లో రిటైర్‌మెంట్ ప్రకటించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.






