మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంతో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు ఆమె వ్యక్తిగత జీవితంపై కొత్త ఊహాగానాలు మొదలుపెట్టారు.
నిహారిక ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఆమె ముఖం కనిపించకపోయినా, పట్టుచీరలో, ఒళ్ళో మల్లెపూలతో, చేతినిండా గాజులు, చేతికి గోరింటాకుపెట్టుకున్నట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు ఇది నిహారిక రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫోటో అయి ఉండొచ్చని చర్చించుకుంటున్నారు.
మరోవైపు ఇది నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫోటో కాదని, ఆమె వదిన లావణ్య త్రిపాటి శ్రీమంతం వేడుకలో తీసిన ఫోటో కావచ్చని అంటున్నారు. లావణ్య ఇంట్లో సింపుల్‌గా శ్రీమంతం జరిపి ఉంటారని కొంతమంది అంటే ఇంకొంత మంది ఇది 9 నెలల వేడుక కావచ్చని కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది నిజంగా నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫోటోనా? లేక కుటుంబ వేడుకలో భాగంగా తీసినదా? అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఈ ఫోటోతో నిహారిక మళ్లీ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారడం మాత్రం నిజం.

ఇక నిహారిక 2020లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్నప్పటికీ, కొద్ది సంవత్సరాల్లోనే వారి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం కెరీర్‌పై దృష్టి పెట్టిన నిహారిక, నిర్మాతగా ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో మంచి విజయం సాధించింది. అలాగే, తమిళంలో నటించిన ‘మద్రాస్ కారన్’ సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం నిహారిక మంచు మనోజ్‌తో కలిసి ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవుతున్నదీ, త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుందని సమాచారం.






