టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో నితిన్(Nitin) ఇప్పుడు తమ్ముడు(Thammudu) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆ టైటిల్ తో కొన్నేళ్ల క్రితం వచ్చి ఐకానికి హిట్ అందుకున్నారు. ఇప్పుడు అదే టైటిల్‌తో నితిన్ మూవీ చేశాడు. ఇది థియేటర్లలో జులై 4వ తేదీ నుంచి సందడి చేయనుంది. వకీల్ సాబ్, MCA ఫేమ్ వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వం వహించిన తమ్ముడు మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. యంగ్ బ్యూటీ సప్తమి గౌడ(Saptami Gouda), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) ఫిమేల్ లీడ్స్‌లో నటిస్తున్నారు. సీనియర్ నటి లయ(Laya) కీలక పాత్రలో రీఎంట్రీ ఇస్తోంది.

‘తమ్ముడి’కి A-సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
అయితే సినిమా విడుదలకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సెన్సార్(Censor) ఫార్మాలిటీస్‌ను కంప్లీట్ చేసుకున్నారు. సెన్సార్ బోర్డు(Censor Board) అధికారుల నుంచి A సర్టిఫికెట్ అందుకున్నారు. దీంతో రిలీజ్‌కు ముందు జరగాల్సిన అన్ని పనులను మేకర్స్ పూర్తి చేసుకున్నట్లు అయింది. థియేటర్స్‌లోకి వచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే మిగిలి ఉంది. అదే సమయంలో తమ్ముడు మూవీకి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్(Censor certificate) పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
U/A Cinema ke manak Tickets tegavu inka ‘A’ Certificate antey etla Anna @actor_nithiin#Thammudu pic.twitter.com/YmoZP46oPK
— Gopinath 🧡 (@NavvutuUndandi) June 27, 2025
నిరాశపర్చిన రాబిన్ హుడ్
ఎందుకంటే సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న విషయం తెలిసిందే. అక్క కోసం ఏదైనా చేసే తమ్ముడి స్టోరీతో తెరకెక్కుతోంది. కాబట్టి తమ్ముడు చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇవ్వడం స్పెషలే. సినిమాలో విలేజ్ వైల్డ్ బ్యాక్ డ్రాప్ కారణంగా సెన్సార్ ఈ విధంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్(Promotions)లో బిజీ అయిపోయారు. రాబిన్ హుడ్(Rabinhood) డిజాస్టర్‌తో నిరాశ పడిన నితిన్‌కు ఈ మూవీతో అయినా హిట్ దక్కుతుందేమో చూడాలి.






