
పెర్ఫార్మెన్స్కు ప్రాధాన్యత ఉండే క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ను పెంచుకుంది నటి నిత్యా మేనన్ (Nithya Menen). ఏది పడితే అది కాకుండా ఎప్పుడో ఒకటైనా సరే మంచి సినిమా చేసేందుకే ఆసక్తి చూసే నిత్య.. చాలా రోజుల గ్యాప్ తర్వాత నటించిన మూవీ ‘సార్ మేడమ్’ (Sir Madam). ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లిపై అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. ఇప్పుడు ప్రేమ గురించి ఆలోచించే స్టేజ్ దాటిపోయాయని, ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ మ్యారేజ్ సాధ్యం కాదు అని పేర్కొంది.
సోల్మేట్ కోసం వెతికాను..
“లవ్ గురించి ఎన్నో సంవత్సరాల క్రితం ఆలోచించాను. ఇప్పుడు దానికి నా జీవితంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం కారణంగా సోల్మేట్ ఉండడం అనివార్యమని గతంలో అనిపించేది. అతడి కోసం వెతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మనం వేరేరకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని తర్వాత అర్థం చేసుకున్నా. ప్రతిఒక్కరికీ ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా చేసుకోవడం సాధ్యం కాదు కదా. రతన్ టాటా కూడా వివాహం చేసుకోలేదు. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే.. అది జరిగినా.. జరగకపోయినా మార్పు ఉండదు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్చగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకుసాగాలి’ అని పేర్కొన్నారు.
“Marriage Is Wonderful If It Happens. And If It Doesn’t, That’s Perfectly Fine Too.” – Nithya Menen#NithyaMenen #marriage pic.twitter.com/B3fKuScow7
— DailyNews.Buzz (@DailyNewsBuz) July 23, 2025
ఈ నెల 25న రానున్న సార్ మేడమ్
విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో నిత్యామీనన్ కలిసి నటించిన మూవీ ‘సార్ మేడమ్’ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. భార్యాభర్తల మధ్య సాగే రొమాంటిక్ ఎంటర్ టైనర్గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్కు సంబంధించిన కొన్ని ప్లిక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
💥 Bookings open now for #ThalaivanThalaivii!
A fun-packed family entertainer hitting theatres this Friday! 🍿#VijaySethupathi | #NithyaMenen pic.twitter.com/iagVXxZOTy
— Kollywood Now (@kollywoodnow) July 23, 2025