
ఎన్నో అంచనాలతో ఇటీవల రిలీజ్ అయిన ‘రాబిన్‌హుడ్(Rabinhood)’ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో నితిన్(Nitin) ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే దీనిని కవర్ చేసుకునేందుకు నితిన్ మరో మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు(Thammudu)’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో అనుకున్న సమయానికి ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దిల్ రాజు(Dil Raju) బ్యానర్‌లో డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ(Saptami Gouda) హీరోయిన్‌గా, లయ(Laya) కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది.
అక్కాతమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో..
చాలా ఆశలు పెట్టుకుని చేసిన రాబిన్ హుడ్(Rabinhood) తీవ్రంగా నిరాశపరచడంతో నితిన్ ఫ్యాన్స్ ‘తమ్ముడు(Thammudu)’ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్(Release Date) ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జులై 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో అక్కాతమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. కాగా ఈ మూవీ విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
#Thammudu releasing on July 4th.#Nitin #SapthamiGowda pic.twitter.com/P1Gjrrnivn
— Matters Of Movies (@MattersOfMovies) April 21, 2025