పాకిస్థాన్ పురుషుల క్రికెట్(Pakistan Men’s Cricket) జట్టుకు భారీ షాక్. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్(Los Angeles Olympics-2028)లో ఆ జట్టు పాల్గొనడం డౌటే. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్(Cricket) పునరాగమనం చేయబోతుంది. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొంటాయి. అయితే, ఇంకా క్వాలిఫికేషన్ ఫార్మాట్ ఖరారు కాలేదు. జట్ల అర్హతకు రీజినల్ క్వాలిఫయింగ్ ఫార్మాట్(Regional qualifying format)ను ఐసీసీ(ICC) డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఆసియా, ఓషియానియా, యూరోప్, ఆఫ్రికా, అమెరికాలలో నంబర్ వన్‌గా ఉన్న జట్టు మాత్రమే ఒలింపిక్స్‌కు నేరుగా క్వాలిఫై కానుంది.

కివీస్, విండీస్ జట్లకు నిరాశ తప్పదు
ఇక ఆసియా నుంచి భారత్(India) ఒలింపిక్స్‌లో పాల్గొంటుంది. రీజినల్ క్వాలిఫయింగ్ ఫార్మాట్‌తో ముందుకు వెళ్తే పాక్ జట్టు విశ్వక్రీడల్లో పాల్గొనలేదు. పాకే కాదు న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు కూడా విశ్వక్రీడలకు దూరం కావాల్సిందే. ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా(Australia), అమెరికాస్ నుంచి ఆతిథ్య జట్టు USA ప్రాతినిధ్యం వహించనున్నాయి. దీంతో కివీస్, విండీస్ జట్లకు నిరాశ తప్పదు. ఇక, ఆరో జట్టును ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ ప్రక్రియపై ఐసీసీ స్పందిస్తేనే ఓ క్లారిటీ రానుంది.

టీ20 ఫార్మాట్‌లో ఆరు జట్ల పోటీ
కాగా ఇందులో పురుషులు, మహిళల టీ20 ఫార్మాట్‌లో ఆరు జట్లు పోటీపడనున్నాయి. ప్రతి జట్టు 15 మంది ఆటగాళ్లతో మొత్తం 90 మంది అథ్లెట్లకు అవకాశం కల్పించారు. క్రికెట్ మ్యాచ్‌లు దక్షిణ కాలిఫోర్నియా(Southern California)లోని పోమోనాలోని ఫెయిర్‌గ్రౌండ్స్ వేదికగా జరుగుతాయి. ఈ టోర్నమెంట్ 2028 జులై 12 నుంచి 29 వరకు నిర్వహిస్తారు. మహిళల ఫైనల్ 2028 జులై 20న, పురుషుల ఫైనల్ జులై 29న జరుగుతుంది. ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు అర్హత సాధించాయి. మరో జట్టు ఏదనేది ఐసీసీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
No Pakistan cricket team in 2028 Olympics, claims Report. India to qualify on the basis of… #Pakistan #Olympicshttps://t.co/lYFtiJJ8U0
— CricketNDTV (@CricketNDTV) July 30, 2025






