మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మహేశ్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం (Gunturu Kaaram)’ చిత్రం తర్వాత తదుపరి ప్రాజెక్టు ప్రకటించలేదు. అయితే తన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేస్తారని వార్తలు వచ్చినా.. ఇటీవల బన్నీ-అట్లీతో సినిమాకు కమిట్ అవ్వడంతో ఈ చిత్రం అటకకెక్కింది. బన్నీతో సినిమాకు ప్రస్తుతానికి బ్రేక్ పడటంతో ఈ డైరెక్టర్ మరో స్టార్ హీరోతో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఆ స్టార్ హీరో తెలుగు నటుడు కాదట. మరి ఎవరంటే..?
కోలీవుడ్ హీరోతో త్రివిక్రమ్ మూవీ
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Actor Dhanush) తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల ధనుశ్ తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరితో సార్ చిత్రం చేశాడు. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ములతో కుబేర (Kubera) చేస్తున్నాడు. ఇక తాజాగా త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ చేసేందుకు రెడీ అయ్యాడట ఈ తమిళ నటుడు. ఇక ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే అదిరిపోతుందని నెటిజన్లు అంటున్నారు. త్రివిక్రమ్ డైలాగులు, ధనుశ్ చెబితే ఉంటుందీ.. ఆ ఊహే అద్భుతంగా ఉందంటున్నారు.
త్రివిక్రమ్-ధనుశ్ సినిమా
అయితే త్రివిక్రమ్-ధనుశ్ (Trivikram Dhanush Film) సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కాంబోలో మూవీ వస్తోందంటూ న్యూస్ వైరల్ కావడంతో సినీ లవర్స్ చాలా ఖుష్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు దీని గురించి అప్డేట్ వస్తుందా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్ పడిందని కాస్త నిరాశ చెందినా.. ధనుశ్ తో గురూజీ సినిమా అనేసరికి ప్రేక్షకుల్లో ఒకరకమైన క్యూరియాసిటీ నెలకొంది. ఈ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందోనని ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాతో ధనుశ్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానున్నాడు.






