
ఇంట గెలిచి రచ్చ గెలవమని పెద్దలు చెబుతుంటారు. ఈ నానుడిని చాలా మంది టాలీవుడ్ హీరోయిన్లు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు దక్కించుకుని ఇక్కడ స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు. ఆ తర్వాత ఇతర భాషల్లో ఛాన్సులు రాగానే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఇలా టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్ కు వెళ్లారు.
View this post on Instagram
బాలీవుడ్ కు మరో తెలుగు నటి
ముఖ్యంగా టాలీవుడ్ నుంచి హిందీ పరిశ్రమకు ఇటీవల చాలా మంది హీరోయిన్లు వరుస కడుతున్నారు. బాలీవుడ్ మేకర్స్ కూడా తెలుగు హీరోయిన్లకు రెడ్ కార్పెట్ తో వెల్ కమ్ చెబుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, సమంత రుత్ ప్రభు (Samantha), రష్మిక మందన్న (Rashmika Mandanna), కీర్తి సురేశ్ వంటి హీరోయిన్లు టాలీవుడ్ లో తమ సత్తా చూపించి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీల్లోనూ వరుస అవకాశాలతో రాణిస్తున్నారు. ముఖ్యంగా సామ్, రష్మిక అయితే బాలీవుడ్ హీరోయిన్లకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు.
View this post on Instagram
అనన్యకు హిందీ మూవీ ఆఫర్
ఇక తాజాగా ఈ జాబితాలోకి మరో తెలుగు నటి చేరింది. అయితే ఈమె టాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించుకోలేదు. కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తన సత్తా చాటింది. ఆమే.. తెలుగమ్మాయి అనన్య నాగళ్ల (Ananya Nagalla). మల్లేశం, వకీల్ సాబ్ (Vakeel saab), ప్లే బ్యాక్, తంత్ర, పొట్టేల్ వంటి సినిమాల్లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక సోషల్ మీడియాలో అందాల వల వేస్తూ కుర్రాళ్ల మనసు గెలిచేస్తోంది. ఇలా తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తున్న అనన్యకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది.
View this post on Instagram
బాలీవుడ్ ఆఫర్
త్వరలోనే అనన్య నాగళ్ల (Ananya Nagalla Hindi Film) బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఏక్తా ఫిల్మ్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై హిమ్మత్ లడుమోర్ నిర్మాణంలో ఈ భామ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. రాకేశ్ జగ్గి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనన్య ట్రైబల్ లేడీగా కనిపించనున్నట్లు తెలిసింది. కాంత అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో టాలీవుడ్ హీరోయిన్లు పాగా వేస్తున్న సమయంలో అనన్య హిందీ మూవీలో లీడ్ రోల్ చేయడమే కాదు.. వుమెన్ సెంట్రిక్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకోవడం తెలుగువారందరికి గర్వకారణం అని నెటిజన్లు అంటున్నారు.