భయాన్నే భయపెట్టే యాక్షన్.. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ తెలుగు ట్రైలర్‌ చూశారా?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్ (Ajith Kumar) నుంచి మరో సినిమా వచ్చేస్తోంది. ఇటీవలే ‘పట్టుదల’తో డిజాస్టర్ మూటగట్టుకున్న ఆయన ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నారు. పట్టుదలతో నిరాశ పరిచిన అజిత్-త్రిష ఈసారి ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ (Good Bad Ugly )’ అంటూ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు.

వాడు భయాన్నే భయపెట్టేవాడు

ఇందులో భాగంగా ఇప్పటికే ట్రైలర్ (Good Bad Ugly Telugu Trailer) విడుదల చేశారు. అయితే అజిత్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లోనూ ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. భయాన్నే భయపెడతాడు అంటూ అజిత్ పాత్రను హైలైట్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నా వైఫ్ కోసం వదిలిపెట్టా

‘దమ్ము నాకోసం వదలిపెట్టా.. మందు నా వైఫ్ కోసం వదిలిపెట్టా.. వైలెన్స్ నా కొడుకు కోసం వదిలిపెట్టా. కానీ నా కొడుక్కే ఆపదొస్తే వదిలింది పట్టుకోవాలిగా’.. అంటూ అజిత్ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ‘వాడు భయాన్నే భయపెట్టేవాడు’ అంటూ అజిత్ పాత్ర గురించి చెప్పే డైలాగ్ ఈ సినిమాలో అజిత్ యాక్షన్ మెంటల్ మ్యాడ్ నెస్ గా ఉంటుందని చెప్పకనే చెబుతోంది. ఇక ట్రైలర్ చివరలో అలనాటి తార సిమ్రన్ (Actress Simran) కనిపించి సర్ ప్రైజ్ చేశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *