
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘పెద్ది (Peddi)’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఫీ మేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఫస్ట్ షాట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఒటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికైనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు.. ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసెయ్యాల.. పుడ్తామా ఏటి మళ్లీ.. సెప్మీ అంటూ చెర్రీ చెప్పిన డైలాగ్ ఈ గ్లింప్స్ నకు హైలైట్ గా నిలిచింది. అయితే ఈ వీడియో ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తోంది.
పెద్ది రికార్డు
టాలీవుడ్‌లో విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ దక్కించుకున్న గ్లింప్స్ (Peddi Glimpse) గా పెద్ది చిత్ర గ్లింప్స్ రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 30 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. 21 గంటల్లో 30.8 మిలియన్ల వ్యూస్‌ను సాధించించి.. ఇప్పటివరకూ టాప్‌లో ఉన్న దేవర (Devara), పుష్ప2 రికార్డులను బీట్ చేసింది. ఈ వీడియోకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగనట్లుగా కనిపిస్తోంది.
టాలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్ ఇవే..
- పెద్ది (30.8 మిలియన్లు)
- దేవర (26.17 మిలియన్లు)
- గుంటూరు కారం (20.98 మిలియన్లు)
- పుష్ప2 (20.45 మిలియన్లు)
- ది ప్యారడైజ్ (17.12 మిలియన్లు)
వచ్చే ఏడాది రిలీజ్
ఇక పెద్ది సినిమా స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ పాత్ర బ్యాట్ పట్టుకుని కొట్టిన షాట్ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ చిత్ర హిందీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో తన పాత్రకు రామ్‌చరణ్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.