ర‌ష్మిక‌- విజ‌య్ దాగుడు మూతలు.. మళ్లీ దొరికిపోయారుగా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఏప్రిల్ 5వ తేదీన తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంది. అయితే ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా రష్మిక తన బర్త్ డే సందర్భంగా వెకేషన్ కు వెళ్లింది. ఎప్పటిలాగే ఒంటరిగా కాకుండా టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కలిసి వెళ్లింది. అయితే ఈ ఇద్దరూ కలిసి వెళ్లకపోయినా.. ఒకే చోటుకు మాత్రం వెళ్లారు. విజయ్ దగ్గరుండి మరి తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక పుట్టిన రోజు సెలబ్రేట్ చేశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు పోస్టు చేయకుండా.. విడివిడిగా ఉన్న పిక్స్ మాత్రమే పోస్టు చేశారు. అయితే బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉండటంతో నెటిజన్లకు మరోసారి ఈ లవ్ బర్డ్స్ దొరికిపోయారు.

విడివిడిగా వెళ్లి.. కలిసి సెలబ్రేషన్స్

చాలా కాలంగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న (Vijay Rashmika Latest News) రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరు సీక్రెట్ గా వెకేషన్లకు వెళ్తున్నా.. ఫొటోలు, వాటి బ్యాక్ గ్రౌండ్ మాత్రం వీళ్లను పట్టించేస్తున్నాయి. తాము లవ్ లో ఉన్నట్లు ఈ జంట ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రేమలో లేనట్లూ చెప్పలేదు. చాలా కాలంగా వీరు నెటిజన్లతో దోబూచులాడుతున్నారు. ఇక తాజాగా రష్మిక బర్త్ డే (Rashmika Birth Day) సందర్భంగా విజయ్, రష్మిక ఒమన్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను నెట్టింట షేర్ చేశారు. ఇక నేషనల్ క్రష్ ఫొటో పోస్టు చేయగానే విజయ్ దేవరకొండ ఎక్కడ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇక విజయ్ కూడా తన ఇన్ స్టాలో ఫొటోలు షేర్ చేయడంతో ఇద్దరూ ఒకే చోట ఉన్నారనేది కన్ఫామ్ చేశారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

విజయ్-రష్మిక దాగుడుమూతలు

రష్మిక కంటే ఒకరోజు ముందే విజయ్ ముంబయి నుంచి ఒమన్ వెళ్లాడు. మరుసటి రోజు ఈ భామ కూడా అక్కడికే చేరుకుంది. ఇలా ప్రతిసారి లాగే ఈసారి కూడా విడివిడిగా వెళ్లి కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఈ ఇద్దరూ కన్ఫామ్ గా లవ్ లో ఉన్నారని అంటున్నారు. చెప్పకనే చెబుతూ ఈ జంట హింట్స్ ఇస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ జంట మాత్రం ఇప్పట్లో తమ ప్రేమ గురించి అధికారికంగా ప్రకటించేలా లేరు. ఇక కెరీర్ లో ఇద్దరూ జెట్ స్పీడులో దూసుకెళ్తుండటంతో ఇప్పట్లో ఈ ఇద్దరు పెళ్లి గురించి ఆలోచన చేసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో ‘కింగ్‌డమ్ (KINGDOM)’ చేస్తున్నాడు. మరోవైపు రష్మిక ఇటీవలే సల్మాన్ ఖాన్ తో సికందర్ లో నటించింది. ఇప్పుడు  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend)’ చేస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *