‘సుకుమార్.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్’.. తారక్ పోస్టు వైరల్

‘నాన్న.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్’ అంటూ.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), డైరెక్టర్ సుకుమార్ కాంబోలో నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తారక్, సుక్కు కాంబో సూపర్ హిట్ అయింది. ఈ కాంబోలో మరో మూవీ వస్తే బాగుంటుందని ఇప్పటికీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వీరికి సినిమా పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ మంచి బాండింగ్ ఉంది. అయితే తాజాగా సుకుమార్, ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటో ఒకటి నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

NTR Sukumar Viral Photo

తారక్, సుక్కు.. ఓ క్యూట్ ఫొటో

తాజాగా ఎన్టీఆర్, డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు బ్లాక్ డ్రెస్సులో ఓ సోఫాపై కూర్చొని హగ్ చేసుకున్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూస్తుంటే వీళ్ల మధ్య ఉన్న ఆత్మీయానుబంధం ఏంటో ఇట్టే అర్థమైపోతోంది. అయితే ఈ ఫొటోను సుకుమార్ సతీమణి బబితా (Babitha Sukumar) ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దానికి తారక్ కు ప్రేమతో అనే క్యాప్షన్ జత చేసి ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశారు. అయితే ఈ పోస్టుపై మ్యాన్ ఆఫ్ మాసెస్ స్వయంగా స్పందించారు.

నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్

బబిత షేర్ చేసిన ఫొటోను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాలో షేర్ చేశారు తారక్ (Tarak Latest News). దానికి ఓ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ అని క్యాప్షన్ రాసుకొచ్చి కింద సుకుమార్ ను ట్యాగ్ చేశారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలోని డైలాగ్ ను క్యాప్షన్ గా పెట్టడంతో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. అయితే ఉన్నట్టుండి ఈ ఫొటో ఇప్పుడు వైరల్ కావడంతో ఈ కాంబోలో మరో సినిమా వస్తుందా అన్న డౌటు ప్రేక్షకుల్లో కలిగింది. ఇది నిజమైతే బాగుంటుందని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *