ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేశాయి. ఈ వారం స్టార్ హీరోల సినిమాలు వస్తాయని అనుకున్నా.. కోలీవుడ్, బాలీవుడ్ నటుల సినిమాలు తప్ప టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలేం విడుదలకు రెడీగా లేవు. ఇక ఏప్రిల్ రెండో వారంలో థియేటర్లలో సందడి చేసేందుకు పలు ఆసక్తికర సినిమాలు రెడీ అయ్యాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar), బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఈ వారం తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. మరోవైపు ఓటీటీలోనూ ఆకట్టుకునే సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అయ్యాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..
థియేటర్లో సందడి చేయనున్న సిత్రాలివే..
- గుడ్ బ్యాడ్ అగ్లీ – ఏప్రిల్ 10వ తేదీ
- జాట్ – ఏప్రిల్ 10వ తేదీ
- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి – ఏప్రిల్ 11వ తేదీ
- కౌసల్య తనయ రాఘవ – ఏప్రిల్ 11వ తేదీ
- బజూక – ఏప్రిల్ 10వ తేదీ
- అకాల్ – ఏప్రిల్ 10వ తేదీ
- పూలే – ఏప్రిల్ 11వ తేదీ
ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే..
నెట్‌ఫ్లిక్స్
- పెరుసు: ఏప్రిల్ 11 (తెలుగులోనూ)
- కిల్ టోనీ (వెబ్‌సిరీస్): ఏప్రిల్ 7 (ఇంగ్లిష్)
- బ్లాక్ మిర్రర్ 7 (వెబ్‌సిరీస్): ఏప్రిల్ 10 (ఇంగ్లిష్)
- ఫ్రోజెన్ హాట్ బాయ్స్: ఏప్రిల్ 10 (ఇంగ్లిష్)
అమెజాన్ ప్రైమ్ వీడియో
- ఛోరీ 2: ఏప్రిల్ 11 (హిందీ)
ఈటీవీ విన్
- లైఫ్ పార్ట్‌నర్: స్ట్రీమింగ్ అవుతోంది (తెలుగు)
- ఉత్తరం: స్ట్రీమింగ్ అవుతోంది (తెలుగు)
- టుక్ టుక్: ఏప్రిల్ 10 (తెలుగు)
జియో హాట్‌స్టార్
- ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 (యానిమేషన్ సిరీస్): ఏప్రిల్ 11 (హిందీ)
సోనీలివ్
- ప్రావింకూడు షాపు: ఏప్రిల్ 11 (తెలుగులోనూ)






