బాలీవుడ్ ప్రేక్షకులతోపాటు టాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి నటించిన యాక్షన్ డ్రామా ‘వార్ 2’ (War 2) ట్రైలర్ వచ్చేసింది. ఎన్టీఆర్, హృతిక్ పోటాపోటీగా తలపడ్డారు. (War 2 Trailer). ‘ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను’ అంటూ ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ కియారా అడ్వాణీ (Kiara Advani) మరింత అందంగా కనిపించడమే కాదు.. యాక్షన్ తోనూ ఆకట్టుకుంది.
దేశవ్యాప్తంగా డాల్బీ అట్మాస్ థియేటర్లలో..
అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. వార్ 2 సరికొత్త రికార్డును నెలకొల్పబోతోంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా డాల్బీ అట్మాస్ థియేటర్లలో అలరించనుంది. దీంతో భారీ స్థాయిలో డాల్బీ అట్మాస్ థియేటర్లలో విడుదలవుతున్న మొదటి ఇండియన్ సినిమాగా నిలవనుంది. ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. ఆడియన్స్ డాల్బీ అట్మాస్ సౌండ్‌ను అద్భుతంగా ఆస్వాదించగలుగుతారని.. ఇది భారతీయ చిత్ర నిర్మాణంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతుందని నిర్మాతలు పేర్కొన్నారు.






