War 2: ఎన్టీఆర్, హృతిక్ కలిసి డ్యాన్స్ చేస్తే.. ‘దునియా సలాం అనాలి’ టీజర్ వచ్చేసింది

బాలీవుడ్ ప్రేక్షకులతోపాటు టాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ‘వార్ 2’ (War 2). ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి నటించిన యాక్షన్ డ్రామా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ‘వార్ 2’ టీమ్ ప్రచార జోరు పెంచింది. అయితే తమ డ్యాన్స్ స్టెప్స్ తో దుమ్మురేపే హృతిక్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారిద్దరి కలిసి డ్యాన్స్ చేసిన ‘దునియా సలాం అనాలి’ సాంగ్ టీజర్ ను టీమ్ తాజాగా రిలీజ్ చేసింది. అయితే పూర్తి పాటను మాత్రం ఇప్పుడే రిలీజ్ చేయడం లేదని, థియేటర్లోనే దీన్ని ఎంజాయ్ చేయాలని మూవీ బృందం కోరింది.

స‌రికొత్త రికార్డు

హృతిక్ రోషన్, కియారా మధ్య సాగే ‘ఊపిరి ఊయలగా’ అని సాగే రొమాంటిక్ సాంగ్ ను ఇటీవలే విడుదల చేయగా మంచి స్పందన వచింది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వార్ 2 స‌రికొత్త రికార్డును నెల‌కొల్ప‌బోతోంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా డాల్బీ అట్మాస్ థియేటర్లలో విడుదలవుతున్న మొదటి ఇండియన్ సినిమాగా నిలవనుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *