Tollywood: ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో భారీ మైథలాజికల్ మూవీ?

ఎన్టీఆర్(Jr.NTR) అభిమానులకు అదిరిపోయే న్యూస్. యంగ్ టైగర్ తన తర్వాతి సినిమా ఎవరితో చేయబోతున్నారనేదానిపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌(Trivikram Srinivas)తో తారక్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్(Allu Arjun) కోసం ఓ అద్భుతమైన మైథలాజికల్(Mythological) టచ్ కథను రెడీ చేసిన త్రివిక్రమ్. తాజాగా బన్నీ డేట్స్ కుదరకపోవడంతో NTRతో చేయాలనే ఆలోచనలు సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మైథలాజికల్ టచ్ అంటే ఎన్టీఆర్‌కు బాగా సెట్ అవుతుందని, దీనికి ఎన్టీఆర్ కూడా నో అనే అవకాశం లేదనే టాక్ వినబడుతోంది.

ఆ సినిమాలు పూర్తయిన తర్వాతే..

కాగా వీరిద్దరి కాంబోలో ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ బాక్సాఫీస్(Box Office) వద్ద బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇటీవల ఈ కాంబో మూవీపై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగవంశీ(Suryadevara Nagavamsi) ఆస‌క్తిక‌ర కామెంట్స్ కూడా చేశాడు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో పౌరాణిక క‌థాంశంతో ఓ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. అయితే ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేస్తోన్న ప్రాజెక్ట్‌ల‌తో పాటు మ‌హేశ్ బాబు-త్రివిక్ర‌మ్ మూవీ పూర్త‌యిన త‌ర్వ‌తే ఈ మైథ‌లాజిక‌ల్ మూవీని ప్రారంభిస్తారని సమాచారం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *