Jr NTR: ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సారీ చెప్పిన తారక్.. ఎందుకో తెలుసా?

‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్(‘War 2’ pre-release event) తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తెలంగాణ ప్రభుత్వాని(Telangana Govt)కి క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌(Hrithik Roshan)తో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా జరిగినప్పటికీ.. ఎన్టీఆర్ తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పోలీసు శాఖ సహకారాన్ని ప్రస్తావించడం మరచిపోయారు. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు ఆయన సోషల్ మీడియా(SM)లో ఒక వీడియో విడుదల చేశారు.

ఇక ఆ వీడియోలో ఎన్టీఆర్ “ఈవెంట్‌లో ముఖ్యమైన విషయం చెప్పడం మరచిపోయాను. నా 25 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పు జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) గారికి, హైదరాబాద్ పోలీసు(Hyderabad Police) శాఖకు నా కృతజ్ఞతలు. వారి సహకారంతో ఈవెంట్ విజయవంతమైంది” అని క్షమాపణలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

12 ఏళ్ల తర్వాత పబ్లిక్ ఈవెంట్‌కు

‘వార్ 2’ సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తన 25 ఏళ్ల సినీ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. 2013లో ‘బాద్‌షా(Baadshah)’ ఈవెంట్‌లో జరిగిన తొక్కిసలాటలో అభిమాని మరణించిన ఘటన తర్వాత పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉన్న ఎన్టీఆర్, 12 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల సహకారాన్ని కొనియాడారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *