
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన 2005లో వచ్చిన సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అనుష్క శెట్టి. ఆ తర్వాత మహానంది, విక్రమార్కుడు, అస్త్రం, అరుంధతి, బాహుబలి వంటి బిగ్ హిట్స్‌లో నటించి, టాప్ హీరోయిన్‌గా నిలిచింది.
అరుంధతి సినిమా అనుష్క కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ మూవీతో లేడీ ఓరియెంటెడ్ సినిమా స్పెషలిస్టుగా మారి, ‘లేడీ సూపర్‌స్టార్’ అనే బిరుదు కూడా సొంతం చేసుకుంది. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అభిమానులు ఆమెను ప్రేమగా ‘స్వీటీ’ అని పిలుస్తారు. ఇటీవల నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా 2023లో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
ఇదంతా పక్కన పెడితే, అనుష్క సినిమాల్లోనే కాదు… టీవీ సీరియల్‌లో కూడా నటించిందన్న విషయం చాలామందికి తెలియదు. 2007లో మా టీవీలో ప్రసారమైన యువ అనే సీరియల్‌లో అనుష్క చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఈ సీరియల్‌కు అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఆ టైంలో ఈ సీరియల్ యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వాసు, నాగలక్ష్మి లవ్ స్టోరీ చుట్టూ ఈ సీరియల్ నడవగా… ఇందులో కృష్ణు, విశ్వ, రష్మి, కరాటే కళ్యాణి, కరుణ తదితరులు నటించారు.
ఇప్పుడు ఈ సీరియల్‌కు సంబంధించిన ఓ వీడియో క్లిప్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇందులో దర్శక ధీరుడు రాజమౌళి, అనుష్క లు గెస్ట్ రోల్స్‌లో కనిపించారు. అనుష్క, వాసు లవర్‌గా చిన్న సీన్‌లో స్క్రీన్ మీద మెరుపులా మెరిసింది అనుష్క. కేఫ్‌లో వాసు తన ఫ్రెండ్స్‌కి ఆమెను పరిచయం చేస్తాడు. ఆమెను చూసిన రష్మి, ఇతర అమ్మాయిలు జెలసీగా ఫీలవుతారు – ఆ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పటి యంగ్ అనుష్కను మళ్లీ స్క్రీన్ పై చూసి ఫ్యాన్స్ ఆనందంగా ఫీల్ అవుతున్నారు.