Netflix: ఓజీ, ‘అనగనగా ఒకరాజు’ మూవీల ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. పవన్, యంగ్ డైరెక్టర్ సుజిత్(Sujith) కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ఓజీ(OG). తాజాగా ఈ మూవీ విడుదలకు ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇక మరో హీరో న‌వీన్ పొలిశెట్టి న‌టిస్తున్న మూవీ ‘అనగనగా ఒకరాజు(Anaganaga Oka Raju)’. క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం కూడా రిలీజ్ డేట్‌కు ముందే OTTని లాక్ చేసుకుంది. ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అవుతాయని తాజాగా ఆ సంస్థ ట్వీట్ చేసింది. OG మూవీని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ‘అనగనగా ఒకరాజు’ తెలుగ‌, త‌మిళం, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ బాష‌ల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు తెలిపింది.

పాలిటిక్స్‌లో పవన్.. యాక్సిడెంట్‌తో నవీన్

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ మూవీలో పవన్(Pawan) సరసన ప్రియాంక మోహనన్(Priyanka Mohanan) నటిస్తోంది. DVV ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. శ్రియారెడ్డి(Shriya Reddy) కీలక రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్‌లో బిజీగా ఉండటంతో షూటింగ్ స్లోగా జరుగుతోంది. ఇక న‌వీన్ పొలిశెట్టి(Naveen Polishetti) న‌టిస్తున్న మూవీ ‘అనగనగా ఒకరాజు’. క‌ళ్యాణ్ శంక‌ర్(Kalyan Shankar) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Choudhari) ఈ చిత్రంలో కథానాయికగా న‌టిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో ప్రారంభ‌మైంది. హీరో న‌వీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ కావ‌డంతో కొన్నాళ్లు ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *