మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) 60 వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా వెండితెరపై వెలుగులు విరజిమ్ముతున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండుతూ తన లుక్‌లతో అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. రెగ్యులర్ వర్కవుట్స్, స్ట్రిక్ట్ డైట్స్‌తో ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేస్తూ మరోసారి తాను మెగాస్టార్ అని నిరూపిస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్‌లో ఉండటం తెలిసిందే.
వశిష్ట డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇందులో చిరుకు జోడీగా త్రిష మరియు ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్రాండ్ విజువల్స్, డివోషనల్ టచ్ కలిగిన కథాంశంతో ఈ సినిమా 2025లో విడుదల కానుందని టాక్. షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
చిరు మరో చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార(Nayanthara) కథానాయికగా నటిస్తోంది. పూర్తిగా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవనున్నాయి. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి చిరంజీవి ఎనర్జీ కలిస్తే, మరో బ్లాక్‌బస్టర్ ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.

చిరంజీవికి భార్యగా, చెల్లిగా, ప్రియురాలిగా నటించిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా ఆమె ఒక లేడీ సూపర్ స్టార్ హీరోయిన్. ఆమె గతంలో చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అతనికి భార్యగా కనిపించింది. అనంతరం ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరుకు చెల్లిగా నటించింది. ఇప్పుడు అనిల్ రావిపూడి చిత్రంలో మరోసారి చిరుతో జతకట్టనుంది. ఒకే హీరోకు భార్యగా, చెల్లిగా, ప్రియురాలిగా.. ఇలా మూడు విభిన్నమైన పాత్రలు పోషించిన హీరోయిన్‌గా నయనతార ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.
ప్రస్తుతం నయనతార దక్షిణాది సినీరంగంలో లేడీ సూపర్‌స్టార్గా వెలుగొందుతోంది. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ, టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో సూపర్‌హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే షారుక్ ఖాన్‌తో కలిసి ‘జవాన్’ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.






