సినీ ఇండుస్త్రీలోకి అడుగుపెట్టే ప్రతి నటికి మొదటి చిత్రంతోనే భారీ విజయాలు దక్కవు. కానీ కొందరు నటీమణులు, మొదటి సినిమాతో హిట్ రాకపోయినా తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించగలుగుతారు. అలాంటి వారిలో అదితి గౌతమ్(Aditi Gautam) ఒకరు.
తెలుగులో 2008లో విడుదలైన ‘నేనింతే'(Neeninthe) సినిమాతో అదితి గౌతమ్ తెరకు పరిచయం అయ్యారు. మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) హీరోగా, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకోనప్పటికీ అందులో డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో రవితేజ సరసన నటించిన శియా గౌతమ్(Sriya Gautam) పాత్రలో అదితి తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.
అయితే ఈ మూవీ తర్వాత తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన అదితి, హిందీలో ‘సంజూ’ వంటి ప్రాజెక్ట్‌లో నటించి కనిపించారు. అయినా ఆమెకు టాలీవుడ్‌లో తిరిగి మళ్లీ అవకాశాలు లభించలేదు.
View this post on Instagram
ఇప్పుడు మాత్రం అదితి గౌతమ్ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్స్‌తో ఫుల్ అట్రాక్షన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవలే ఎర్ర చీరలో దిగిన ఫోటోషూట్ ఆమెను మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చేసింది. సింపుల్ లుక్‌లోనే ఆమె చూపించిన గ్లామర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
‘నేనింతే’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల నుండి దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన ఫాలోవర్స్ ను పెంచేస్తోంది అదితి.






