One Plus Phone: వన్​ ప్లస్​ పోల్డ్​బుల్​ ఫోన్​ వచ్చేసింది

హైదరాబాద్​: వ‌న్‌ప్లస్​ ఫోల్డ్​బుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తుంది.వ‌న్‌ప్లస్​ వ‌న్‌ను భార‌త్‌లో తొందరలోనే లాంఛ్ చేసేందుకు కంపెనీ సిద్దం అయిందని తెలుస్తుంది.లాంఛ్‌ చేయడానికి ముందే వ‌న్‌ప్లస్​ ఓపెన్ డిజైన్ టీజ‌ర్‌ను కంపెనీ ఆన్‌లైన్‌లో రివీల్ ను ఒపెన్​ చేసింది. అక్టోబ‌ర్ చివ‌రి వారంలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానున్నట్లు వార్తలు వైరల్​ అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఈ న్యూడివైజ్ ఇండియ‌న్ ఎంట్రీని వ‌న్‌ప్లస్​ నిర్దారించింది. ఫోల్డ్​బుల్ ఫోన్ కొంతమేర ఫోల్డ్ రూపంలో ఉన్న ఇమేజ్‌ను వ‌న్‌ప్లస్​ ట్విట్టర్​లో షేర్ చేసింది. స్లీక్ బ్లాక్ క‌ల‌ర్ వేరియంట్‌లో వ‌న్‌ప్లస్​ ఓపెన్ ఆక‌ట్టుకునేలా డిస్‌ప్లేలో క‌నిపిస్తుంది.

డివైజ్ ఎడ‌మ వైపున అల‌ర్ట్ స్లైడ‌ర్‌ను, కుడివైపున వాల్యూమ్ రాక‌ర్‌, ప‌వ‌ర్ బ‌ట‌న్ క‌నిపించాయి. నిజ‌మైన వ‌న్‌ప్లస్​ ఎక్స్‌పీరియ‌న్స్ సిద్ధంగా ఉంది..అతి త్వరలోనే లాంఛ్ అంటూ ఇమేజ్‌కు క్యాప్షన్​ కూడా ఇచ్చారు. ఇక వ‌న్‌ప్లస్​ ఇండియా మార్కెట్‌లో రూ 1.2 ల‌క్షలు వరకు ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఇక ఫోన్ స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే 7.82 ఇంచ్ ఓఎల్ఈడీ ఇన్నర్​ స్క్రీన్‌, 6.31 ఇంచ్ ఓఎల్ఈడీ అవుట‌ర్ డిస్‌ప్లేతో ఆక‌ట్టుకుంటుంది. వ‌న్‌ప్లస్​ ఓపెన్ ఆక్టా-కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెస‌ర్‌తో వినియోగదారులు ముందుకు రాబోతుంది. కెమెరా ఫీచ‌ర్లను చూస్తే వ‌న్‌ప్లస్​ ఓపెన్ ట్రిపుల్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌తో 48 ఎంపీ ప్రైమ‌రీ, 48 ఎంపీ సెకండ‌రీ సెన్సార్​లను క‌లిగిఉంటుంది. 3x ఆప్టిక‌ల్ జూమ్‌ను క‌ల్పిస్తూ టెలిఫొటో లెన్స్‌తో కూడిన 64ఎంపీ సెన్సార్​లతో రానుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 100డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్ చేస్తూ 4805ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం క‌లిగిఉంటుంది.

Share post:

లేటెస్ట్