
ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా భారత్(Team India)తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్(Pakistan) జట్టు టాస్(Toss) నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్(Dubai) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో భారత్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా తొలి మ్యాచు జట్టతోనే బరిలోకి దిగుతోంది. అటు పాకిస్థాన్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయంగా దూరమవడంతో ఇమాముల్ హక్(Imam-ul-Haq) అతడి స్థానంలో వచ్చాడు. కాగా 2023 ప్రపంచ కప్ ఫైనల్ నుంచి వన్డేల్లో భారత్ వరుసగా 12 టాస్‌లను కోల్పోయింది. దీంతో వరుస అత్యధిక టాస్ ఓడిపోయిన కెప్టెన్‌గా రోహిత్(Rohith Sharma) శర్మ నిలిచాడు.
తుది జట్లు ఇలా..
భారత్: రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(WK), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
పాకిస్థాన్: ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(W/C), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.